Monday 29 July 2013

అపస్వరాలు(నవల) by SARADA - ebook

Hi,

Please find the link to read "అపస్వరాలు(నవల)" e book.

http://www.scribd.com/doc/155875536/Apaswaraalu

Sarda Abimanulu.
Anil and Ravi

గుంఢెల్ని పిండే ‘శారద’ జీవన యానం

Hi ,

Please find the link to read Book review of "SARADA" by Vihari:

Thanks to "Sudhama" garu.

http://sudhamadhuram.blogspot.in/2013/07/blog-post_27.html


Saturday, July 27, 2013

గుంఢెల్ని పిండే ‘శారద’ జీవన యానం




ఇప్పుడు బతికిలేడు గానీవుండి వుంటే ‘శారద’కూడా సాహిత్యంలోజ్ఞానపీఠ మంత ఎత్తుకుఎదగగలిగిన వాడే.ఎస్.నటరాజన్ అనే ఒకతమిళ కుర్రాడు తెనాలిలోబతుకు తెరువుకై1937లో అడుగుపెట్టి,తెలుగు సాహిత్యం మీద
అభిమానం పెంచుకుని,హోటల్ సర్వర్‌గాపనిచేస్తూనే- రచనావ్యాసంగం సాగించాడు.నిజానికి తెలుగు కథ,నవలా సాహిత్యంలోసహజాతి సహజమైనవాస్తవిక రచనా ధోరణికిఒక సుస్పష్టమైనరూపాన్నిచ్చిన
వాడతడు.

‘శారద’ కలంపేరుతో రచనలు చేసిననటరాజన్-పుట్టిందితమిళనాడులోని పుదుక్కోటలో.1946లో పెదపూడిలోనెల రోజుల పాటు జరిగినఅరసం సాహిత్యపాఠశాలలో ఇరవైరెండేళ్ళ కుర్రాడిగా పాలుపంచుకుని, సాహిత్యచైతన్య యాత్రప్రారంభించాడు.‘ప్రపంచానికి జబ్బుచేసింది’ అనే వ్యంగ్యరచన 14 జూలై1946లోఎస్.నటరాజన్ పేరుతోనే‘ప్రజాశక్తి’ పత్రికలో
తొలిసారిగా అచ్చయ్యింది.1948 జనవరి 20నజ్యోతి సంచికలో‘గొప్పవాడి భార్య’ అనేవ్యంగ్య రచనమొట్టమొదటిగా ‘శారద’పేరున అచ్చయ్యింది.
అక్కణ్ణుంచీ నటరాజన్‘శారద’ పేరునపుంఖానుపుంఖాలుగారచనలు చేయసాగాడు.

అప్పట్లోనే ‘శారద’-అన్నపూర్ణ అనే విడోనితెలిసే ఇష్టపడి, గుళ్ళోదండలు మార్చుకుపెళ్ళాడి, ఆ తరువాతపెళ్ళి రిజిస్టర్చేయించుకున్నాడు.శారదకు ఆకలి తెలుసు,దరిద్రం తెలుసు,కష్టాలూ, కడగండ్లుతెలుసు.హోటల్ సర్వర్‌గా  ఎన్నిహోటళ్ళు మారాడో!కొన్నాళ్ళు ‘జ్యోతి’ఆఫీసులో ధనికొండసహకారంతో పనిచేశాడు.కొంతకాలం తానే తెనాలిషరాబ్ బజార్లో చిన్నహోటల్ నడిపాడు.భాగస్వామి మోసం చేసిపోయాడు. బుర్రిపాలెంలోశారద టీ బంకు పెట్టిమున్సిపాలిటీవారివేధింపులు తట్టుకోలేకఎత్తేసాడు. పాతపుస్తకాలూ, పత్రికలూఅమ్మాడు. ‘ఉప్పు మజ్జిగ’కుండలోపోసుకుకూర్చునిఅమ్మాడు.చేతికీనోటికీచాలనిసంపాదనతో
ఇబ్బందులుపడ్డాడు.అప్పులుచేసిఈసడింపులు పొందాడు.

అతని ఆరోగ్యమూఅంతంత మాత్రమే!మూర్ఛరోగంతోబాధపడేవాడు. అయినాఅతని సాహిత్య రచనావ్యాసంగంసృజనాత్మకతతోమూర్ఛనలు పోయేది.ఆలూరిభుజంగరావు,ఆలపాటిరవీంద్రనాథ్,ముక్కామలమల్లికార్జున
రావుతోడునీడగాఆదుకునేవారు.పోలవరపు శ్రీహరిరావు,
రావూరి భరద్వాజశారదకు మిత్రులు.ఆయన హాస్యానికి-పో.శ్రీహరిరావూ, రా.భరద్వాజాఅంటుండేవారట!కిల్లీకొట్టుదగ్గరే నిలబడిపత్రికలు, పుస్తకాలు శారద చదివేస్తూండేవాడు.

‘మంచీచెడు’,‘అపస్వరాలు’, ‘ఏదిసత్యం’, ‘చీకటి తెరలు’,‘మహీపతి’, ‘అందాలదీవి’, వంటి నవలలు,‘రక్తస్పర్శ’ పేరిట 35కథల సంపుటి- శారదసాహిత్యంగా అందినమేలిముత్యాలు.‘అడవిమల్లె’ అనే నవల,అలాగే ‘వరార్ణవం’ అనేఅసంపూర్ణ నవల,‘కార్యదర్శి’,‘సాలెగూడు’, ‘హోటల్లోశవం’ అనే డిటెక్టివ్నవలలు, ‘నాగరికునిప్రేమ’ అనే నవలిక,'అభాగ్యుడు’, 'హోటల్ వర్కర్' అనేనాటికలు,శారదఅముద్రితరచనలుగాదొరకనివిగా
వున్నాయి. ‘వేయిన్నొక్కరాత్రులు’ పేరిట సింద్‌బాద్ సాహసయాత్రలు వంటి రచనలుచేసినట్లు తెలుస్తోంది.

శారదది ఒక పక్క కటికదరిద్రం, మరోపక్కఅనారోగ్యం. ఆ అనారోగ్యంకూడా- ఎప్పుడు, ఎక్కడ,ఏ స్థితిలో హఠాత్తుగాపడిపోతాడోఊహించలేనిమూర్ఛరోగం. పడితేదేహానికి గాయాలై మరోబాధని కల్పించే అవకాశంవున్న జబ్బు. తెలుగులోఅసలు ఎలాంటి ప్రాథమికవిద్యాభ్యాసం లేకుండానే-తెలుగు నవల, కథాసాహిత్యానికిఅపురూపమైన సామాజికరచనల్ని అందించిన
ఘనుడు శారద. 

శారదజీవనయానం- ఆయనతోప్రత్యక్షంగా పరిచయంకలిగిన విహారిగారు సి.పి.బ్రౌన్ అకాడమీకోసం గ్రంథస్థం చేశారు.కష్టజీవి, సాహిత్యచిరంజీవి అయిన శారదగురించి ఈ పుస్తకం ఎంతోవివరంగా, ఆర్ద్రంగా,ఆత్మీయంగా
తెలియచేస్తూంది.‘సాహిత్య బాటసారిశారద’ పేరిట ఆలూరిభుజంగరావుగారి గ్రంథంతర్వాత,మరింత సమగ్రంగా శారద దుఃఖభరితజీవితాన్నీ, అపూర్వసాహిత్యాన్నీ విహారి ఎంతో హృద్యంగారచించారు.

కవిగా,కథకుడిగా,విమర్శకుడి గావిహారి సుప్రసిద్ధులు. ఇప్పుడీరచనతో జీవిత చరిత్రరచయితగా తనవిలక్షణతనూ,విశేషజ్ఞతనూకనబరిచారు. శారదనవలలు, కథానికలు,‘నరబలి’- ‘అహల్య’వంటి నాటికలు, శారదవ్యంగ్య కథనాలుమొదలయిన ఆయనసాహితీ సర్వస్వాన్నివిహారి ఇందులోపరిచయం చేసారు.

‘‘స్వాతంత్య్రం వచ్చాకఇట్లాఉండదనుకున్నాను.పత్రికల వాళ్ళు కథలువేస్తే ఇచ్చేడబ్బులు నామూర్ఛరోగాన్ని నయంచేయటానికయినా సరిపోతాయని సంతోషించాను. అదివట్టిదై పోయింది. ఈపద్ధతిలో నేను స్వతంత్రభారత పౌరుణ్ణని భావించలేకపోవడంలో తప్పేమీలేదనుకుంటాను’’ అనిశారద 18.2.1949 ‘తెలుగు స్వతంత్ర’పత్రికలో రాసాడు.రచయిత దుఃఖభరితమైన అనుభవం,బాధ, వ్యవస్థ నిరాదరణ,అందుపట్ల ‘అధిక్షేపం’-ఆనాడే శారద అభివ్యక్తీకరించాడు.

‘‘సమాజం తనలాంటివారికందిస్తున్న నిష్ఠురసత్యాల ఆధారంగా శారదతన ప్రాపంచికదృక్పథాన్నిపెంపొందించుకున్నాడు.’’ అంటూ విహారిగారు-‘‘శారద మీద చలంరచనల ప్రభావం వుంది.ఇక రచనని కళారూపంగానిరాడంబరశైలీ శిల్పాలతోతీర్చిదిద్దటంలో శారదమీద కొడవటిగంటికుటుంబరావు ప్రభావం చాలా ఎక్కువగాపడింది’’ అనివివరించారు. అదియథార్థం.

‘‘శారద విశ్వాసంలోసామాజిక మానవుడూ,వ్యక్తియైన మానవుడూవేరువేరు ఉనికికలిగినవారుకారు.మానవుడిబహిరంతరప్రవర్తనా,చిత్తవృత్తీ పరస్పరాధారాలూ,పరస్పర ప్రభావితాలూ,పరస్పర పూరకాలూకూడా. అందుకనేఈభావనని ఏ జీవనసిద్ధాంతాన్నో విడమర్చిచెబుతున్నట్లు కాకుండా,శారద తన భావాన్నిపాత్రగతంగాచూపుతాడు’’ అంటూవిహారి విశ్లేషించారు.

శారద సాహిత్యంలోనూ,జీవితంలోనూ కూడా సంఘజీవిగా, కష్టజీవిగా బ్రతికాడు. ‘మంచీ చెడు’,‘అపస్వరాలు’ వంటినవలల ద్వారాసాహిత్యంలో శారదతెచ్చిన మార్పు, చూపినమార్గం విభిన్నమైనవి,విలక్షణమైనది. దౌర్భాగ్యజన జీవితాన్ని కూడాకథాగతం చేసిందాయనే.వాస్తవిక దృక్పథం అనేది శారదముద్ర.తెలుగుపాఠకప్రపంచం శారదనువిస్మరించకూడదు. 
1955 ఆగస్టు 17న-కేవలం 31 ఏళ్ళకే శారదమరణించాడు. కానీ-తెలుగు సాహిత్యంలోతనదైన ముద్రతో,నాటినుంచీ జీవించేవున్నాడు. 

విహారి గారి ఈ పుస్తకంసాహిత్యాభిమానులందరూ చదవదగిన మంచిపుస్తకం.


కష్టజీవి, సాహిత్యచిరంజీవి
శారద
- విహారి
సి.పి.బ్రౌన్అకాడమీ 53,నాగార్జునహిల్స్,
పంజగుట్ట,హైదరాబాద్-2
వెల: రూ.95 /-
==========
(ఆంధ్రభూమి  దినపత్రిక: అక్షర పేజి:27.7.2013)


Sarada Abhimani
Anil

Monday 1 July 2013

"స్మ్రతి శకలాలు - సాహిత్య బాటసారి శారద" by ఆలూరి భుజంగరావు[E-BOOK]

Hi,

Please find the link to read "స్మ్రతి శకలాలు - సాహిత్య బాటసారి శారద" by ఆలూరి భుజంగరావు
Thanks to Ravi kiran Kotha for making the ebook and contribute for the noble cause[Sarada works should be avilable for telugu readers].
Reson for making the ebook: Telugu readers should not forgot a great writer SARADA alias S.NATARAJAN.


Scribed link: http://www.scribd.com/doc/151014272/SmrutiSakalaalu



Thanks
Sarada Abhimani